Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ముగ్గురికి గాయాలు
నవతెలంగాణ- వెల్దండ/ రఘునాధపల్లి
పిడుగుపాటుకు ఇద్దరు మహిళలతో పాటు ఓ రైతు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘ టన నాగర్ కర్నూల్, జనగామ జిల్లాల్లో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లిలో బొల్లంపల్లి గ్రామ పంచాయతీ ఈదమ్మ బండ తండాకు చెందిన నేనావత్ నాన్కు (50), నేనావత్ రుక్మిణి (25) సమీపంలోని గుట్టల ప్రాంతం వద్ద పశువులు కాస్తు న్నారు. వీరితో పాటు నేనవత్ నాన్కు, రుక్మిణి, వైశాలి, కళ, రూప్లా కూడా ఉన్నారు. కాగా, మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపుల తోకూడిన భారీ వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందికి చేరుకున్నా రు. ఉరుముల మెరుపుల కారణంగా ఒక్కసారిగా వీరికి సమీపంలో పిడుగు పడటంతో చెట్టు కింద ఉన్న వారికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే నాన్కు, రుక్ష్మిణి మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. మిగిలిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో వైశాలి పరిస్థితి విషమిమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో ఆస్పత్రికి తరలించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ట చంద్రమౌళి (48) తన వ్యవసాయ బావి వద్ద పనిలో ఉండగా, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఈ క్రమంలో రాత్రి 7.45 సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడటంతో రైతు అక్కడికకక్కడే మృతి చెందాడు. ఆవు దూడ కూడా మృత్యువాతపడ్డాయి. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.