Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిహాబ్‌తో బహుళ ప్రయోజనం
- గుండె జబ్బులను దూరంగా నెట్టే అవకాశం
నేడు ప్రపంచ గుండె దినోత్సవం. మనిషి బతుకుకు ముఖ్యమైన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం గుండె జబ్బులకు కారణాలను తెలుసుకుని ముందుగా జాగ్రత్త పడటం మంచింది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీకు ఫలానా రిస్క్ ఫాక్టర్స్ ఉన్నాయి. అందుకే హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతారు. ఆ రిస్క్ ఫాక్టర్స్ ఏమిటంటే?.... డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ సేవించడం, హై బ్లడ్ ప్రెషర్, ఒత్తిడితో కూడిన జీవితం, ఎప్పుడు కూర్చునే ఉండటం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, గుర్తించని కారణాలు...
హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆంజియో ప్లాస్టీ చేయడం గానీ, బైపాస్ సర్జరీ చేయడం గాని జరుగుతుంది. దానితో పాటు నిర్వహణ కోసం ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీకు తెలుసా రిస్క్ ఫాక్టర్స్ అన్ని కూడా తగ్గించుకుని మరో హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ మార్చుకోబడును. ఇంకోసారి ఛాతి నొప్పి రాకుండా చేసుకోవచ్చు. కార్డియాక్ రిహాబ్ ద్వారా సంతోషంగా ఉండవచ్చు.
డయాబెటీస్
చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చేంత వరకు వారికి డయాబెటీస్ ఉన్న విషయం తెలియదు. కొందరికి డయాబెటీస్ ఉన్న విషయం తెలుసు. ఔషధాలు రెగ్యులర్‌గా తీసుకోవడం తెలుసు. కానీ అది నియంత్రణలో లేదన్న సంగతి తెలియదు. కార్డియాక్ రిహాబ్ ద్వారా శరీరంలో ఉన్న కండరాలు యొక్క పనితీరు పెరుగుతుంది. ద్షాని వల్ల కండరాల గ్లూకోస్ తీసుకోవడం పెరిగిపోతుంది. తద్వారా డయాబెటీస్ అనే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయి మరో హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. .
కుటుంబ చరిత్ర
కొన్ని హార్ట్ అటాక్‌లు కుటుంబంలో వారసత్వంగా వస్తుంటాయి. ఎందుకంటే ఈ సమస్య వారి జన్యువుల్లో ఉంటుంది. ఈ జన్యువులను కూడా సరి చేసుకోవచ్చు. దాన్నే ఎపీ జెనెటిక్స్ అంటారు. జీవనశైలి ద్వారా జన్యువుల్లో లోపాలను సరి చేసుకోవచ్చు. ఏ కుటుంబంలోనైతే ఈ జన్యువులున్నాయో కార్డియాక్ రిహాబ్ చేసుకోవడం ద్వారా వారి జన్యువులు మారిపోయి హార్ట్ అటాక్ రాకుండా దూరం అవుతుంది.
హై బ్లడ్ ప్రెషర్
దీర్ఘకాలికంగా హైపర్ టెన్షన్ ఉండటం వల్ల గుండె బాగా గట్టిపడి దాని కండరాలు గదుల సైజు చిన్నగా అవుతుంది. దీని వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలుంటాయి. కార్డియాక్ రిహాబ్ ద్వారా పాజిటివ్ మార్పులు గుండె కండరాల్లో వస్తాయి. దీంతో గదుల సైజు పెరుగుతుంది. దీన్ని ఎక్సెంట్రిక్ డయలటేషన్ అంటారు. ఇలాంటి మార్పే ప్రొఫెషనల్ అథ్లెటిక్స్‌లో కూడా ఉంటుంది. తద్వారా హార్ట్ అటాక్ అనేది నివారించుకోవచ్చు.
కూర్చునే ఉండటం
చాలా మంది గుండె జబ్బులున్న వారు ఎక్కువ సమయం కూర్చుని ఉండేందుకే ఇష్టపడతారు. ఇంట్లో, ప్రొఫెషనల్ పనులను తగ్గించుకుంటారు. సహజంగానే ఇలాంటి జీవనశైలి వల్లనే హైపర్‌టెన్షన్, డయాబెటీస్, హార్ట్ అటాక్ లు వస్తాయి. కార్డియాక్ రిహాబ్ చేసుకోవడం ద్వారా గుండె బలం పెరుగుతుంది. శారీరకంగా ధృఢంగా తయారవుతారు. ఇంటి దగ్గర ఆడుకునే ఆటలు తిరిగి ఆడుకోవచ్చు.
తెలియని కారణాలు
కొన్ని సార్లు హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలను డాక్టర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తుల్లో వీటికి సమాధానం దొరికే అవకాశముంది. వీరు కూడా కార్డియాక్ రిహాబ్ చేసుకోవడం ద్వారా మరో హార్ట్ అటాక్ ను రాకుండా కాపాడుకోవచ్చు.
కార్డియాక్ రిహాబ్ అంటే?...
కార్డియాక్ రిహాబ్ అనేది... లెవల్-1 రికమెండేషన్. వివిధ గుండె జబ్బులు ఉన్న వారికి, హార్ట్ ఫెయిల్యూర్, డయాలేటెడ్ కార్డియో మయోపతి, వాల్వ్ సర్జరీ, బైపాస్ సర్జరీ, మయోపతీస్, స్టెంట్ వేసుకున్న వారు. వ్యాయామం చేయక పోవడం వల్ల రోగుల గుండె ఆరోగ్యం ఇంకా ప్షాడైపోతుంది. కార్డియాక్ రిహాబ్ వల్ల గుండె పంపింగ్ సామర్థ్యం, శారీరక శక్తి ఇంకా పెరుగుతుంది. పలుమార్లు ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి తప్పుతుంది. మెరుగైన జీవితం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. రిస్క్ ఫాక్టర్స్ అన్నింటిని తగ్గించుకుని నూతన జీవితాన్ని ప్రారంభించుకోవచ్చు.
దేశంలోనే ఏకైక రిహాబ్ సెంటర్
సనత్‌నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దేశంలో మొట్టమొదటి సారిగా కార్డియాక్ రిహాబ్ను స్థాపించారు. బీపీ, షుగర్, జన్యుపరమైన లోపాలు, స్మోకింగ్, డ్రింకింగ్ కారణాలు, గుర్తించని కారణాలతో హార్ట్ అటాక్ వచ్చిన రోగులు కార్డియాక్ రిహాబ్ చేయించు కున్నారు. ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో మూడు నుంచి నాలుగు నెలల పాటు రిహాబ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఒక్కొక్కరికి వారి గుండె పరిస్థితి, జబ్బును బట్టి రకరకాల కార్డియో వ్యాయామాలు చేయిస్తున్నారు. రిహాబ్ అయిన మూడు నెలల తర్వాత వీరిలో షుగర్, బీపీ తగ్గిపోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల నుంచి బయటికి రావడమే కాకుండా శారీరకంగా చాలా ఫిట్ అవుతున్నారు. గుండె బలం, ఫిట్నెస్ పెరగడం వల్ల వీరిలో ఔషధాల వాడాల్సిన డోసులు కూడా తగ్గడం విశేషం. తద్వారా ఆర్థిక భారం కూడా తగ్గుతున్నది. కుటుంబంలో భయం పోగొట్టుకుని సంతోషంగా ఉంటున్నారు. ఏకంగా మారథాన్ రన్నింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఎన్ఎండీసీ నిర్వహించిన మారథాన్‌లో 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల క్యాటగిరీల్లో కూడా పాల్గొన్నారు.
యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు
నేడు ప్రపంచ గుండె దినోత్సవం. ఆధునిక కాలంలో ఒత్తిడితో పాటు గుండె జబ్బులు కూడా పెరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్నేండ్లుగా యువతలోనూ వ్యాధులు క్రమేణా పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. దేశంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి రెండు గంటలకు, రాష్ట్రంలో ప్రతి 43 గంటలకు ఒకరు 30 ఏండ్లలోపు వారు గుండెపోటుకు చికిత్స చేయించుకుంటున్నట్టు సమాచారం. ఇవే కాకుండా కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇతర పథకాలు, నగదుతో చేరిన వారి సంఖ్య పోలిస్తే ఎక్కువ మంది ఉంటారు. శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, ఆల్కహాల్ సేవించడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం తదితర అలవాట్లతో కూడిన మారిన జీవనశైలి ఈ పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్ మురళీధర్ బాబీ
అసిస్టెంట్ ప్రొఫెసర్
డిపార్ట్ మెంట్ ఆఫ్ పీఎంఆర్
కార్డియాక్ రిహాబ్ స్పెషలిస్ట్
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్
సెల్ నెంబర్ 93901 23451