Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లోని మరో 1,000 దేవాలయాలకు ధూప దీప నైవేధ్య పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 1,588 దేవాలయాలకు ధూప దీప నైవేధ్య పథకం మంజూరు కాగా, ఆలయ నిర్వాహకుల నుంచి స్పందన రాలేదు. దీంతో జీహెచ్ఎంసీకి మంజూరైన 1,588 ఆలయాల్లో నుంచి 1,000 ఆలయాలను తగ్గించి ఈ మేరకు గ్రామీణ ప్రాంత ఆలయాలకు పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని 3,645 ఆలయాలకు ధూప దీప నైవేధ్య పథకం అమలవుతుండగా, ఇటీవలే ప్రభుత్వం కొత్తగా మరో 1,160 ఆలయాలకు మంజూరు చేసింది. ఇది కాకుండా గ్రేటర్ పరిధిలోని 1,588 ఆలయాలకు కూడా ఈ పథకాన్ని మంజూరుచేసి దరఖాస్తులు ఆహ్వానించగా, ఆలయ నిర్వాహకుల నుంచి సరైన స్పందన రాలేదు. ధూప దీప నైవేధ్యపథకం కింద ఆదాయం లేని ఆలయాలకు ప్రతినెలా రూ. 6,000 చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది.