Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో - హైదరాబాద్
కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను పైలెట్ ప్రాజెక్టుగా తొమ్మిది జిల్లాల్లో ప్రారంభించే నిమిత్తం పిలిచిన టెండర్లను ఖరారు చేయవచ్చునని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజరుసేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 23న టెండర్లు పిలవగా, ఆ టెండర్లు హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌కు దక్కేలా ఉన్నాయంటూ లాన్ ఇ-గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రయివేట్ లిమిటెడ్ రిట్ దాఖలు చేసింది. టెండర్లను ఖరారు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ పథకాన్ని ప్రారంభిస్తారనీ, పౌష్టికార కిట్ల పంపిణీ టెండర్ల ఖరారు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో అనుమతిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
మారెడ్‌పల్లి ఇన్స్పెక్టర్కు బెయిల్
మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. వివాహిత కిడ్నాప్, అత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వర రావు జైలుకు వెళ్లారు. ఈ కేసులో బెయిల్ కావాలంటూ ఇప్పటికే రెండు సార్లు నాగేశ్వరరావు కోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా లక్ష రూపాయల పూచీకత్తుతో పాటు, పలు షరతుల మేరకు బెయిల్ ఇచ్చింది. రెండు నెలల పాటు ప్రతీ రోజూ ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందు హాజరు కావాలని హైకోర్టు షరతు విధించింది.