Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మానస పుత్రిక అయిన మిషన్‌భగీరథతో రాష్ట్రంలోని ప్రతీ ఆవాసం తో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగునీరు సరఫరా అవుతుంది . శుద్ధి చేసిన తాగునీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ ''మిషన్ భగీరథ'' దేశానికే ఆదర్శంగా నిలిచింది.
ఈ పథకం అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్‌మిషన్ ద్వారా పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తం గా ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీలు చేసింది. భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే, ప్రజల నుంచి అభిప్రాయాలను సేక రించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది.ప్రతీ రోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగునీరు తల సరి 100 లీటర్లతో అందుతున్నట్టు గుర్తించింది. పథకం నాణ్యత, పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా , ప్రతిరోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్టు గుర్తి ంచబడింది. ఈ క్రమంలో 'రెగ్యులారిటీ కేటగిరీ'లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది. తాగునీటి రంగంలో అద్భుతమైన, అనితరసాధ్యమైన పనితీరు కనపరుస్తూ మిషన్ భగీరథ దేశంలోనే ఆదర్శవం తంగా నిలిచింది. అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున ఢిల్లీలో అవార్డును అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆహ్వా నించింది. రాష్ట్ర ప్రగతిని గుర్తించి, మరోసారి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు, కేంద్ర ప్రభుత్వ జల్జీవన్మిషన్కు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు బుధవారం సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.
సీఎం కేసీఆర్ సహకారం వల్లే ఈ అవార్డులు : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం వల్లే ఈ అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు అహర్నిశలు పని చేస్తున్న తన సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరినీ మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు.