Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో తెలంగాణ శాసన మండలి, శాసనసభ మహిళ ఉద్యోగులు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి,ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
పోచారం హర్షం
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నూతనంగా పోతంగల్ మండలాన్ని ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పోతంగల్ ప్రజలకిచ్చిన హామీ నెరవేరిందని తెలిపారు.