Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశాభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర ఎంతో ఉందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. అద్భుత కట్టడాల వెనుక కార్మికుల శ్రమ దాగి ఉందనీ, అందుకోసం వారు తమ రక్తాన్ని చెమటగా మార్చారని తెలిపారు. ఇంజినీర్లకు సైతం క్లిష్టంగా అనిపించే పనులను కూడా తమ నైపుణ్యంతో చిటికెలో పూర్తి చేస్తారని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని రేవంత్ నివాసంలో భవన నిర్మాణ కార్మికులు కలిసి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. వారి సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. నిర్మాణ సమయంలో మరణించిన కార్మికులకు ఇచ్చే ప్రమాద బీమాను రూ 10 లక్షలకు పెంచాలనీ, ప్రమాదంలో గాయపడితే రూ. 5 లక్షల బీమాతోపాటు కోలుకునే వరకు ప్రతి నెల రూ. 5వేల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి సదుపాయాలు, కార్మికుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఐదుశాతం సీట్లు, విదేశాల్లో చదువుకునేందుకు ఉపకార వేతనాలు, కార్మికుల సంక్షేమ బోర్డు జారీ చేసిన కార్డు ఉండి 60 ఏండ్లు దాటిన వారికి నెలకు రూ. ఐదువేల పింఛను వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్కారు హామీ ఇచ్చిన విధంగా జిల్లా, మండల కేంద్రాల్లో కార్మికుల భవనాల కోసం 10 గుంటల స్థలం, నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందజేయాలని కోరారు. లేబర్ అడ్డాల్లో కార్మికుల కోసం షెల్టర్ ఏర్పాటు చేయాలనీ, ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కార్మికులకు ఇచ్చి సర్టిఫికెట్ మంజూరు చేయాలన్నారు. మున్సిపాలిటీల నుంచి ఎలాంటి రుసుం లేకుండా బిల్డర్ లైసెన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో చెర్మెన్గా, సభ్యులుగా భవన నిర్మాణ కార్మికులను మాత్రమే నియమించాలని కోరారు. సంక్షేమ బోర్డుకు సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. ఇండ్లులేని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో నిర్వహించే సమయంలో కార్మికులను రాహుల్ గాంధీతో కలిపించి వారి సమస్యలను తీర్చడానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు.
గాంధీభవన్లో బతుకమ్మ
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్లో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. హైదరాబాద్ నుంచి మహిళా నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సీతక్క...మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.