Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్మసిస్టు దినోత్సవ వేడుకల్లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజారోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ అధ్యక్షులు సంజయ్ రెడ్డి అధ్యక్షతన ప్రపంచ ఫార్మాసిస్టు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔషధాలు కనిపెట్టడం, తయారు చేయడం, ప్రజలకు అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఫార్మసిస్టుల ద్వారానే మందులు తీసుకోవాలనీ, కొన్ని మందులతో వచ్చే దుష్పరిణామాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వీరారెడ్డి, పార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ బి.యోగానందం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.