Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్డ్ పార్టీతో అధ్యయనం చేయించాల్సిందేనని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ డిమాండ్ చేశారు. ముంపు నివారణా చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సాగునీటి పారుదల శాఖల అధికారులతో వర్చువల్ పద్దతిన జరిగిన సమావేశంలో రజత్‌కుమార్ ఈ డిమాండ్ చేశారు. ముంపు సమస్యలపై ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక మార్పులు జరిగాjనీ, ఆ మేరకు ముంపు సమస్య కూడా తీవ్రం కానుందని రజత్‌కుమార్ గుర్తు చేశారు. అంచనాకు మించి ముంపు వాటిల్లనుందంటూ గణాంకాలతో సహా వివరించారు. చారిత్రక ప్రదేశాలు, పవర్‌ప్లాంట్ ముంపునకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక సమావేశంలో పాల్గొన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సైతం అదే వాదనలను వినిపించాయి. తమ రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందేనని పట్టబట్టాయి. అదే విధంగా ముంపు నివారణకు రక్షణ చర్యలు సత్వరమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
పోలవరం పూర్తి అయితే భద్రాచలానికి ముప్పు లేదు: కేంద్ర ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు కూడా ముప్పు ఉండబోదని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే పోలవరం ప్రాజెక్టు వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు ఆందోళనకు గురవుతున్న మాట వాస్తవమేనని కూడా కేంద్రం తెలిపింది. 2009, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్, దాని ప్రభావాలపై సర్వేలు జరిగాయని తెలిపింది. పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని నివారిచేందుకు కరకట్ట నిర్మించేందుకు ఇంతకుముందే ఏపీ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కేంద్రం ఈ సందర్భంగా ప్రస్తావించింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోమారు బ్యాక్ వాటర్‌పై సర్వే చేయించాలని తెలంగాణ కోరగా, అందుకు కేంద్రం నిరాకరించింది. అదే సమయంలో కరకట్ట నిర్మాణానికి ఏపీ సిద్దమైన నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణకు ఒడిశా ముందుకు రాలేదని కేంద్రం తెలిపింది. ఇక తదుపరి చర్చలు అక్టోబర్ 7న జరుపుదామన్న కేంద్రం... ఆ సమావేశానికి 4 రాష్ట్రాల ఈఎన్సీలు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.