Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణి..
- వైద్యురాలికి బదులు వైద్యం చేసిన నర్స్
- ఆస్పత్రి బాత్రూమ్లో శిశువుకు జన్మనిచ్చిన తల్లి
- పుట్టిన పది నిమిషాలకే శిశువు మృతి
- రెండు రోజుల తర్వాత విషయం వెలుగులోకి...
నవతెలంగాణ-మియాపూర్
ప్రయివేటు వైద్యుల అవగాహన లోపంతో ఒక నవజాత శిశువు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్య, మౌనిక ఏడాదిన్నర క్రితం పెండ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో భార్యకు మూడో నెల గర్భిణి నుంచి లీవ్ ఆస్పత్రిలో రెగ్యులర్ చెక్ఆప్ చేయిస్తున్నట్టు భర్త తెలిపారు. ఆరు నెలల అనంతరం ఆదివారం రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో తాము ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. డాక్టర్ లేకపోవడంతో నర్స్ వీడియో కాల్తో డాక్టర్ల సలహా తీసుకుంటూ వైద్యం చేసిందన్నారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ నర్సుకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో కేవలం గ్యాస్టిక్ సంబంధించిన మందులు ఇవ్వడం ద్వారా తన భార్యకు అబార్షన్ అయిందని వాపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నవజాత శిశువు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం శేరిలింగపల్లి తహసీల్దార్ పోలీసులు ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. కేసు ఎప్పుడు నమోదయింది కేసు నమోదు సంబంధిత క్రైమ్ నెంబర్ ఇతర వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.