Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రెండ్లీగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం:సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
- ఐదేండ్లలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక తెలంగాణ
నవతెలంగాణ-సిద్దిపేట
'ఏపీలో ఉద్యగులు, ఉపాధ్యాయులపై అక్కడి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ జైల్లో వేస్తోంది. మన తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంది. ఏ ప్రభుత్వమూ 100 శాతం సమస్యలు పరిష్కరించలేదు. ఉద్యోగులకు కొంత ఆలస్యమైనా జీతాలు ఇస్తున్నాం. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. నన్ను ఉపాధ్యాయులు కలవొచ్చు' అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ఎస్టీయూ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడారు. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన రూ.30 వేల కోట్లు బకాయిలను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వనరుల ద్వారా ప్రజల అవసరాలు తీరుస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర నాయకులు భుజంగరావు, సదానందంగౌడ్, పర్వతరెడ్డి పాల్గొన్నారు.