Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సోమయ్య, లింగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం రఘుశంకర్‌రెడ్డి అధ్యక్షతన ఈనెల 27,28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో డీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా టి లింగారెడ్డి, ఉపాధ్యక్షులుగా పి శంతన్, వి.రేణుక, వి రాజిరెడ్డి, టి శ్రీశైలం, చాప బాబుదొర, కార్యదర్శులుగా ఎం.శామ్యూల్, ఎస్ భాస్కర్, జె రామస్వామి, ఎ శ్రీనివాస రెడ్డి, బి శ్యామ్, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులుగా ఎం గంగాధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా పి ఈశ్వర్‌రెడ్డితోపాటు సభ్యులుగా సిహెచ్ వెంకటేశ్వర్లు, బి సదానందం ఎన్నికయ్యారు. పలు తీర్మానాలు ఆమోదించామని సోమయ్య, లింగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యారంగాన్ని పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలనూ ఒకే యాజమాన్యం కిందకు తేవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయుల అప్పీళ్లు వెంటనే పరిష్కరించాలనపి తెలిపారు. మహిళలు, బాలికలపై నానాటికీ పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాలని పేర్కొన్నారు.