Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టులను భర్తీ చేయాలని హైకోర్తు తీర్పు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
డీఎస్సీ నోటిఫికేషన్ (2008) బాధితులకు హైకోర్టులో న్యాయం లభించింది. ఇప్పటికీ భర్తీ చేయకుండా ఉన్న 1800 పైచిలుకు పోస్టులను ఆ నోటిఫికేషన్లో మెరిట్ ఉన్న అభ్యర్థులతో భర్తీ చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 52,655 పోస్టుల భర్తీకి 2008 డిసెంబర్ 6న నోటిఫికేషన్ వెలువడింది. ఆ తర్వాత ఏడాది 2009లో ప్రభుత్వం జీవో 28 జారీ చేసింది. దీని ప్రకారం ఆ మొత్తం పోస్టుల్లో 30శాతం అంటే 30558 పోస్టులు సెంకడరీ గ్రేడ్ టీచర్లకు కేటాయిస్తూ నోటిఫికేషన్‌ను సవరించింది. 70 శాతం పోస్టులు బీఈడీ, డీఈడీలకు కేటాయించింది. జీవో 28ని సవాల్ చేస్తూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ కె.శరత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది. 30 శాతం పోస్టులకు చెందిన జీవో 28 జోలికి వెళ్లడం లేదనీ, అయితే ఆ నోటిఫికేషన్ కింద భర్తీ చేయాల్సిన పోస్టుల్లో ఇప్పటికీ తెలంగాణలో 1800కి పైగా భర్తీ చేయలేదనీ, వీటిని ఆ నోటిఫికేషన్లో మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది. మొత్తం 3500 పోస్టుల్లో ఏపీ తమ పోస్టుల్ని భర్తీ చేసిందనీ, తెలంగాణలోని 1800 పోస్టులను ఎనిమిది వారాల్లోగా భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.