Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐపీఏ-ఐఏపీ మధ్య ఒప్పందం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అంతర్జాతీయంగా న్యాయ నిపుణులు పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకొనేలా ఆల్ ఇండియా ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ (ఏఐపీఏ) ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ (ఐఏపీ)తో ఒప్పందం కుదిరినట్టు ఆయా సంస్థల్లో సభ్యుడిగా ఉన్న ప్రముఖ న్యాయవాది, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పద్మారావు లక్కరాజు తెలిపారు. ఈ మేరకు గురువారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వియన్నాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయాల్లో జూన్ 1995లో అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం (ఐఏపీ) స్థాపన జరిగిందన్నారు. దీనిలో 177కి పైగా వివిధ దేశాల నుండి 183 కంటే ఎక్కువ మంది సంస్థాగత సభ్యులు ఉన్నారని వివరించారు. తీవ్రమైన అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, సైబర్ నేరాలు వంటి పలు కేసుల్లో న్యాయం కోసం పరస్పర సమాచార మార్పిడి చేసుకొనేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పారు. జార్జియా రాజధాని నగరం టిబిలిసిలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రాసిక్యూటింగ్ 27వ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయని తెలిపారు.