Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రులపై హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వ పథకాలకు కేంద్ర మంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇచ్చి, గల్లీల్లో మాత్రం అవాకులు పేలుతున్నా రని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శిం చారు. అక్కడ ప్రశంసించి, ఇక్కడ విమర్శిస్తారా ? అని ప్రశ్నించారు. ఒక వైపు అవార్డులు ఇస్తూనే.. మరో వైపు అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. గురువారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా అభినందిస్తూ గల్లీలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. కేంద్రానికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు నిధులు ఇచ్చి వాటా గురించి మాట్లాడాలన్నారు. నిటిఅయోగ్ చెప్పినా రూ.19 వేల కోట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక కమిషన్ సైతం రూ.5300 కోట్లు ఇవ్వాలని చెప్పి నివేదికలు ఇచ్చినా కేంద్రం తుంగలో తొక్కిందని స్పష్టం చేశారు. మొత్తం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని ఆ రెండు సంస్థలు చెప్పినా మోడీ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు. రాజకీయాలు చేయాలనుకుంటే నిధులు ఇచ్చి మాట్లాడాలి.. విమర్శలు చేయడం కాదు అని గర్తు చేశారు. మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో సర్పంచ్‌లు బోర్లు రిపేర్ చేయడానికే పరిమితం అయ్యేవారని గుర్తు చేశారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో నీళ్లు, కరెంట్ సమస్యలు లేవన్నారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీ తెలంగాణ ప్రత్యేకత అని చెప్పారు. దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తున్నదని వివరించారు. మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. దేశంలో ఇంకా ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలకు తాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. వందకు వందశాతం త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని గుర్తు చేశారు. 2014 వరకు 5,600 కుటుంబాలకు నీళ్లు వస్తే.. ఇప్పుడు 23,900 ఇండ్లకు సురక్షిత మంచినీరు అందుతున్నదన్నారు.
కృపాకర్‌రెడ్డికి సత్కారం
మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణంలో తొలి నాళ్ల నుంచి భాగస్వామిగా ఉన్న ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ జి. కృపాకర్‌రెడ్డిని మంత్రి టి.హరీశ్‌రావు సత్కరించారు.