Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు వరంగల్‌కు
- రోడ్ల మరమ్మత్తుకు ఆదేశాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళం ఇవ్వనున్నారు. సతీసమేతంగా యాదాద్రికి రానున్న సీఎం కేసీఆర్ లక్ష్మీనారసింహుడికి ప్రత్యేక పూజలు చేయనున్నట్టు సీఎంవో అధికారవర్గాలు తెలిపారు. యాదాద్రి క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశమూ ఉంది. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రోడ్డుమార్గంలో వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లే రహదారిని యుద్ధప్రాతిపతికన మరమ్మత్తులు చేయాలని ఆర్అండ్బీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు స్థానిక అధికారులకు ఆదేశాలు జారీచేశారు. చిన్న, చిన్న మరమ్మత్తులు ఏమైనా ఉంటే వెంటనే మరమ్మత్తు చేయాలని ఆర్అండ్బీ అధికారులు స్థానిక అధికారులకు సూచించారు. ఈమేరకు గురువారం అర్థరాత్రి వరకు ఈ మరమ్మత్తులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రారంభోత్సవం తరువాత కేసీఆర్ యాదాద్రి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
షెడ్యూల్
శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సీఎం అధికార నివాసం ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రికి బయలుదేరి 11:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత మధ్యాహ్నాం మూడు గంటలకు దేవాలయం నుంచి ప్రగతిభవన్ బయలుదేరుతారు. అలాగే అక్టోబరు ఒకటిన వరంగల్‌లో పర్యటించను న్నారు. పర్యటనలో భాగంగా శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డుమార్గం లో బయలుదేరుతారు. ఉదయం 11:45 గంటలకు వరంగల్-ములుగు రోడ్డులో ఉన్న ప్రతిమా హాస్పిటల్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రతిమా మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. స్థానికంగా ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ నుంచి మధ్యాహ్నాం రెండు గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.