Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
- ముఖ్య అతిథిలుగా పాల్గొన్న తమ్మినేని వీరభద్రం, సీజీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని చర్లపల్లిలో నవతెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం గురువారం జరిగింది. సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలు, పలువురు చిన్నారులు వేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. కార్మికుల కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..పత్రికను పాఠకునికి చేరవేయడంలో ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది పాత్ర కూడా చాలా కీలకమైనదన్నారు. రోజువారీ పనిఒత్తిడితో సతమతమయ్యే కార్మికులు తమ కుటుంబాలతో కలిసి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం మంచి పరిణామం అనీ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. నేడు దేశంలో ఆర్ఎస్ఎస్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ పోవడం వల్ల నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై తీవ్ర భారం పడుతున్న తీరును వివరించారు. ప్రజల మధ్య కుల, మత విభజనలు సృష్టించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పి.ప్రభాకర్ మాట్లాడుతూ.. నవతెలం గాణ అభివృద్ధికి సిబ్బంది చొరవతో పనిచేస్తున్నారనీ, వారి కృషి వల్లనే సంస్థ నేడు ఈ స్థాయిలో ఉందని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ వెన్నంటే ఉన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్ జనరల్ మేనేజర్ రఘు మాట్లాడుతూ.. టెక్ట్స్‌బుక్స్ ముద్రణ సమయంలో సిబ్బంది చాలా కష్టపడి పనిచేశారని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో సంతాప తీర్మానాన్ని మిషన్ ఆపరేటర్ వి.సత్యం ప్రవేశపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన జి.రాధాకృష్ణ మూర్తి, వై.రాజును సమ్మేళనం స్మరించుకున్నది. వారి మృతికి సంతాపం తెలిపింది. కార్యక్రమంలో నవతెలంగాణ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ శశిధర్, ఎస్టేట్ మేనేజర్ వీరయ్య, బుకహేౌజ్ ఇన్చార్జి కృష్ణారెడ్డి, ప్రింటింగ్ ప్రొడక్షన్ ఇన్చార్జి బి.శ్రీనివాస్‌రెడ్డి, మెయింటనెన్స్ ఇన్చార్జి కె.సుధీర్, గురుదీప్, మిషిన్ సెక్షన్ ఆపరేటర్ పి.నగేశ్, సీనియర్ ఆపరేటర్ ఎల్.నర్సింగ్, రవి, సత్యనారాయణ, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.