Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గెరత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్ మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయాలు తెలుసుకుని అభినందించారు. బ్రిటన్ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, ఎగుమతులు, దిగుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. బ్రిటీష్ డిప్యూటీ కమిషన్ రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, అంతర్జాతీయ వాణిజ్య విభాగం అధికారి ప్రణీత్వర్మ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.