Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర ప్రభుత్వం 'మిషన్ భగీరథ' పథకానికి అవార్డును ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు థ్యాంక్స్ చెప్పారు. అదే సమయంలో ఈ పథకానికి రూ. 19 వేల కోట్లు కేటాయించాలనే నిటి ఆయోగ్ సిఫారసులను గౌరవించాలని ట్వీట్ చేశారు. తెలంగాణలో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్న మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వ జల్జీవన్ మిషన్ పురస్కారం లభించింది. ఈ పథకం.. నాణ్యత, పరిమాణంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. అక్టోబరు 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకొనేందుకు రావాలని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.