Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెడికల్ కాలేజీల్లో పోస్టులు, ఆస్పత్రుల్లో సూపరింటెండెంట్‌తో పాటు వివిధ జిల్లాల్లో పోస్టులు తెలంగాణ వారికి దక్కాల్సిన అవసరముందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం డీహెచ్ విభాగం అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సెక్రెటరీ జనరల్ డాక్టర్ దీన్‌దయాళ్, కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికీ మెడికల్ కాలేజీల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వైద్యులున్నారని తెలిపారు. స్థానికులకు దక్కేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరారు. ఇప్పటికీ ఎంబీబీఎస్, బీడీఎస్ బీ కేటగిరీలో స్థానికులకు 85 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.