Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ జాతీయ పార్టీపై సీపీఐ నేత నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దసరా నాటికి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటముని బలపరిచే విధంగా ఉండాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సూచించారు. మతోన్మాదాన్నీ ప్రేరేపిస్తూ, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్ వ్యవస్థను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరమని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేకమంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్తో సహా అన్ని జాతీయ పార్టీలూ ముందుకు వస్తున్నాయని వివరించారు. ఇందుకు కేసీఆర్ కూడా ముందుకు రావడం సమర్థనీయమని పేర్కొన్నారు. ఆయన ప్రకటించబోయే జాతీయ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. బీజేపీ వ్యతిరేక కూటమి బలపడే విధంగా టీఆర్ఎస్ జాతీయ పార్టీ అడుగులు వేస్తే మంచిదనీ, దాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు.