Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు కార్మికుల తరఫున కృతజ్ఞతలు : బాల్కసుమన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటా ఇవ్వాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం గొప్పదని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ కొనియాడారు. కార్మికుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాద్లో టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు సింగరేణి లాభాల్లో కార్మికులకు 18 శాతం వాటా ఇస్తే సీఎం కేసీఆర్ దాన్ని 30 శాతానికి పెంచారని తెలిపారు...దేశంలో ఏ సంస్థలోనూ ఇంతస్థాయి వాటా ఇవ్వట్లేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే సింగరేణి 32 వేల కోట్ల కు పైగా టర్నోవర్ సాధించనుందన్నారు. ఇతర రాష్ట్రాలకూ సంస్థ విస్తరిస్తోందన్నారు. 9 వేల మంది కార్మికుల సర్వీసులను తమ ప్రభుత్వం క్రమబద్దీకరణ చేసిందన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి నిర్మాణాలకు వడ్డీలేని రుణాన్ని సర్కారు ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడే ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ పోతున్నదని విమర్శించారు.