Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్(డబ్ల్యూఎఫ్టీయూ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ మూడో తేదీన అధిక ధరలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులకు సీఐటీయూ పిలుపునిచ్చింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య ప్రతి ఏటా అక్టోబర్ 3న కార్మికవర్గం ఎదుర్కొనే సమస్యలపై సదస్సులు, సెమినార్లు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.