Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యులను కఠినంగా శిక్షించాలి:తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆమనగల్లు పట్టణ కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటును సహించని పెత్తందార్లకు చెందిన కొంతం మంది రజకులపై దాడి చేయడాన్ని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం తీవ్రంగా ఖండించింది. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి బీజేపీ నేత తల్లోజు ఆచారి రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణను తగ్గించుకుండా, వీధి రౌడీల్లా ప్రవర్తించారని విమర్శించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టడం ద్వారానే రజకులపై దాడులు జరిగిందని పేర్కొన్నారు. ఈ దాడిలో నాగిళ్ల జగన్, నాగిళ్ల వెంకటమ్మ ,నాగిళ్ల యాదమ్మ, గంగమ్మ ,మంజుల,పాతకోట నరసింహ, పాతకోట రమేశు, నాగిళ్ల యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు.