Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు గిరిజన సంఘం వినతులు
నవతెలంగాణ-హైదరాబాద్/విలేకరులు
పదిశాతం గిరిజన రిజర్వేషన్ జీవోను తక్షణం జారీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన సంఘం( టిజీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలిస్తూ నిరసనలు జరిగాయి. హైదరాబాద్ సహా వరంగల్, జనగామ, నల్లగొండ, కరీంనగర్, నాగర్కర్నూల్, వనపర్తి, సూర్యాపేట, మేడ్చెల్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మానాయక్, ఆర్. శ్రీరాం నాయక్, గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ , నాయకులు ఆంగోత్ కృష్ణ నాయక్ ,నేనావత్ రజిత ,నిలాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని సెప్టెంబర్ 17న బహిరంగ సభలో ప్రకటించారని గుర్తు చేశారు.