Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 4న రూట్ మ్యాప్‌పై చర్చ
- ద్విగిజయ్సింగ్, జైరాం రమేష్ హాజరు : రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ జాతీయ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర అక్టోబర్ 24న తెలంగాణలోకి రానుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు ఈనెల 4న జాతీయ నాయకులు దిగ్విజయ్‌సింగ్, జైరాంరమేష్ రాష్ట్రానికి రానున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సమస్యలపై రాహుల్ మాట్లాడతారని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా రాహుల్‌కు భద్రత కల్పించాలంటూ శనివారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కలుస్తామని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో భారత్ జోడో యాత్రపై పార్టీ సీనియర్ నేతలతో రేవంత్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ అంశాలు, పాదయాత్ర, మునుగోడు ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, బలరాంనాయక్, చిన్నారెడ్డి, మల్లు రవి తదితరులతో కలిసి రేవంత్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ దేశాన్ని ప్రమాదం నుంచి కాపాడుకునేందుకు చేస్తున్న బృహత్తర యాత్ర దేశ ప్రయోజనాల కోసం ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలన్నారు. దేశాన్ని ఒక బలమైన దేశంగా నిలబెట్టేందుకు కలిసి రావాలని కోరారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని బోయిన్‌పల్లిలో నిర్వహిస్తామన్నారు. సాగరహారం, సకలజనుల సమ్మె టీఆర్ఎస్ ఒక్కటే చేయలేదనీ, కాంగ్రెస్ నేతృత్వం వహించినప్పుడు జరిగినవేన్నారు. తాను ఉద్యమంలో ఎక్కడున్నానో నా శాసనసభ రికార్డ్స్ చూస్తే తెలుస్తుందని చెప్పారు. ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కేటీఆర్ చేసిందేమీలేదని విమర్శించారు. జీవో 610 అమలు చేస్తే కేటీఆర్ చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు.