Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హదరాబాద్
కుల మతాలకతీతంగా ఐక్యంగా పోరాడాల్సిన అవశ్యకత పెరిగిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకులు టి జ్యోతి తెలిపారు. ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకుని పాలకులు తిరోగమన సంస్కృతిని ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్దిపొందాలని ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలపట్ల చులకన భావాన్ని పెంపొందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక భారాలతోపాటు సామాజిక అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పారు. దీంతో స్త్రీలపైన్నే వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీస ప్రజాస్వామిక విలువలను సైతం కాలరాసి..వాటి స్థానంలో మనుధర్మ నీతి, నియమాలను ప్రతిష్టించేందుకు కుట్రలు చేస్తున్నదని తెలిపారు. వారు అనుసరిస్తున్న సాంస్కృతిక భావాజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ సంస్కృతి అవసరమనీ అందుకు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను వదిలేసి ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి మాట్లాడుతూ కాకతీయుల కాలంలోలోనే బతు కమ్మ ప్రసిద్ధి గాంచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐద్యా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి, ఉపాద్యక్షులు ఆశాలత, సహాయ కార్యదర్శులు శశికళ, వినోద, రాష్ట్ర నాయకులు. లక్ష్మమ్మ, స్వర్ణలత, షాబానా బేగం తదితరులు పాల్గున్నారు.