Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సర్కారుకు బక్క జడ్సన్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ విమర్శించారు. మిషన్ భగీరథకు అవార్డులు ఇస్తున్నారు సరే... అందులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ ఎందుకు జరిపించడంలేదని బీజేపీ నేతలను నిలదీశారు. దీనిపై బీజేపీ అధ్యక్షులు బండి సంజరు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చర్చకు సిద్ధమా? అని ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. మిషన్ భగీరథ అక్రమాలపై శుక్రవారం కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖలో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం, అవుషాపూర్ గ్రామం మిషన్‌భగీరథ నీళ్ల పైపులు పరిశీలిస్తే, అక్కడ రెండు ట్యాంకులు కూడా కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేననీ, రూ. 1.30 కోట్ల విలువైన కొత్త పైపులు వేశామని బిల్లులు తీసుకున్నారని పేర్కొన్నారు. చౌదరిగూడలో 60 కాలనీలకుగానూ, 50 కాలనీలకు ఇప్పటికీ మంచినీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాటర్ ట్యాంకులు,పైపుల ద్వారా బోరునీళ్లు, భగీరథ నీళ్లు కలిపి పంపిణి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.