Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సెర్ప్ ప్రణాళికలు
- ఈ ఏడాది రూ.15 వేల కోట్ల రుణ లక్ష్యం
- మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయాలకు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోవడానికీ, ఆర్థికంగా ఎదిగి నలుగురికీ ఆదర్శంగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. మహిళలు సంఘటిత శక్తిగా మార్చటమే లక్ష్యంగా మహిళా స్వయం సహాయ సంఘాలను బలోపేతం చేస్తున్నది. మహిళలను పొదుపు చేసేలా ప్రోత్సహించి ఆ కుటుంబాలను ఆర్థికంగా బలో పేతం చేయడమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణ వైపు నడిపిం చేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మహిళా స్వయం సహాయ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 4,30,648 మహిళా స్వయం సహాయక సంఘాలున్నాయి. 46,09,843 మంది సభ్యులున్నారు. 32 జిల్లా, 553 మండల, 17,980 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. ఆ సంఘాలకు ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 65 వేల కోట్ల 35 లక్షల రూపా యలు బ్యాంకు లింకేజీని కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,96,447 మహిళా సంఘాలకు రూ.3,692 కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించగా, 2021-22లో 2,56, 779 సంఘాలకు రూ.12,259 కోట్ల బ్యాంకు లింకేజీని అందించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో సెర్ప్ ద్వారా 3,70,825 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.15, 001 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరూ 1,18,118 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.6, 887.31 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించింది. మిగతా లక్ష్యాన్ని 2023 మార్చి నెలాఖరులోగా సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి సెర్ప్ ముందుకెళ్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. మహిళలలో పొదుపు చేయాలనే చైతన్యం గణనీయంగా పెరిగింది. బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు పొందుతూ క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. 2021-22లో రుణాల రికవరీ రేటు 98 శాతంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక్కో గ్రూపునకు బ్యాంకు రుణం రూ.1.9 లక్షలుండగా..2022 నాటికి అది రూ.5.41 లక్షలకు చేరుకున్నది. మహిళలు తమకున్న నైపుణ్యంతో అనేక వస్తువులను తయారు చేస్తున్నారు. వాటిని విక్రవయించడానికి ప్రత్యేకంగా మేళాలు నిర్వహిస్తున్నారు. మన దేశ నలుమూలల్లోనే కాకుండా బంగ్లాదేశ్, తదితర దేశాల్లోనూ తెలంగాణకు చెందిన మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శంచి విక్రయిస్తున్నాయి.
ప్లిప్‌కార్ట్, ప్లాట్ లిపిడ్స్‌తో సెర్ప్ ఒప్పందం
రాష్ట్రంలోని గ్రామీణ మహిళా సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాలలో విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకుగానూ రూ.500 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా ప్లిప్కార్ట్తో సెర్ప్ ఒప్పందం కుదుర్చుకున్నది. 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆన్లైన్లో విక్రయించే అవకాశం కలిగింది. ఇలాంటి ఒప్పందం జరగడం దేశంలో ఇదే తొలిసారి.
దీని ద్వారా స్థానికంగా ఉపాధి, ఉద్యోగవకాశాలు మెరుగవుతాయి. మహిళా సంఘం ఉత్పత్తులైన ఎండుమిర్చి మార్కెటింగ్ కోసం ఈ కామర్స్ సంస్థ ప్లాట్ లిపిడ్స్ ప్రయివేటు లిమిటెడ్‌తో సెర్ప్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఏడాది 200 కోట్ల రూపాయల వ్యాపారమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.