Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెబీకి డీఆర్హెచ్పీ సమర్పణ
హైదరాబాద్ : నిర్మాణ, నీరు, మురుగునీరు, చెత్త నిర్వహణ, నిర్మాణ తదితర వ్యాపారాలు కలిగిన ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ లిమిటెడ్స్ నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి డీఆర్హెచ్పీని సమర్పించింది. ఈ ఇష్యూలో 95 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని ఆ కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఈ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను వర్కింగ్ కాపిటల్ సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు తెలిపింది.