Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 జిల్లాల్లో అత్యంత అధికం
- నాలుగు జిల్లాల్లో సాధారణం
- నల్లగొండ జిల్లాలో ఐదు శాతం తగ్గుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఈ సీజన్లో 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పది జిల్లాల్లో అత్యంత అధికం, 19 జిల్లాల్లో అధికం, నాలుగు జిల్లాలో సాధారణ వర్షపాతాలు రికార్డయ్యాయి. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో 91 శాతం అధికంగా వర్షం కురిసింది. సీజన్ సాధారణ సగటు వర్షపాతం 734.8 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకూ(సెప్టెంబర్ 30) 1073.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. గతేడాది ఇదే సీజన్లో 1044.7 మిల్లీమీటర్ల వర్షం పడింది. అంటే గతేడాదితో పోల్చిచూసినా ఏడు శాతం అధిక వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. నిజామాబాద్(1577మిల్లీమీటర్లు), జగిత్యాల(1550 మిల్లీమీటర్లు) జిల్లాల్లో సాధారణం కంటే 91 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యల్పంగా నల్లగొండ జిల్లాలో 505.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదు శాతం తక్కువ కురిసింది.
అత్యంత అధిక వర్షపాతం(60 శాతానికి కంటే ఎక్కువ) పడిన జిల్లాలు 10
నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జనగాం, నారాయణపేట, ములుగు
అధిక వర్షపాతం(20 శాతం నుంచి 59 శాతం వరకు అధికం) పడిన జిల్లాలు 19
ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం
సాధారణ వర్షపాతం (-19 నుంచి 19 శాతం వరకు) నమోదైన జిల్లాలు 4
నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి