Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్మ్ జాతీయ సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయ ఉన్నత విద్యలో నాణ్యత పెరగాల్సిన అవసరముందని పలువురు వక్తలు పేర్కొన్నారు. నేషనల్ అగ్రికల్చర్ అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ (నార్మ్) ఆధ్వర్యంలో గురువారం రాజేంద్రనగర్లో ప్రయివేటు విశ్వవిద్యాలయాలను భాగస్వామ్యం చేయడం ద్వారా వ్యవసాయ ఉన్నత విద్యలో నాణ్యతను పెంచడం అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్సీ.అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య ఒప్పందాల ద్వారా 2030 నాటికి వ్యవసాయ గ్రాడ్యుయేట్ల కొరతను అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల సంఖ్య పెరగడం, వారికి వసతి, ఇతర వనరులు కల్పించే సమస్యకు కూడా ఇదే ఉత్తమ పరిష్కారమని సూచించారు. ఈ సదస్సులో ఉత్తర్ప్రదేశ్ శోభిత్ యూనివర్సిటీ ఛాన్సలర్ కున్వర్ శేఖర్ విజేంద్ర, ఆంధ్రప్రదేశ్లోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ డాక్టర్ వాసుదేవన్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్.శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ ఎస్.కె.సోమ్ తదితరులు పాల్గొన్నారు.