Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొడుకు మాత్రం మైనరే..
- జూబ్లీహిల్స్ లైంగికదాడి కేసులో కీలకమలుపు
- జువైనల్ కోర్టు తీర్పు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటన కేసు శుక్రవారం కీలకమలుపు తిరిగింది. నిందితుల్లో నలుగురిని మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని మైనర్లుగా పరిగణిస్తూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారింది. ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా గుర్తిస్తూ జువైనల్ కోర్టు తీర్పును ప్రకటించింది. ఎమ్మెల్యే కొడుకును మాత్రం మైనర్‌గానే గుర్తించింది. ఓ బాలికను ట్రాప్ చేసి మే 28న నిందితులు సామూహిక లైంగికదాడి చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో ఒకరు మాత్రమే మేజర్ కాగా, ఐదుగురిని మైనర్లుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు నెం.44లోని ఖాళీ ప్రదేశంలో సామూహిక లైంగికదాడి చేసి, సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. మూడ్రోజుల తర్వాత విషయం బయటికొచ్చింది. మెడపై గాయాలు చూసిన బాలిక తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మే 31న ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.