Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-కుభీర్
పత్తి కొనుగోళ్లు ప్రారంభం రోజుకే క్వింటా ధర రూ.10,055 పలకడంతో రైతు ఆనందం వ్యక్తంచేశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని బాలాజీ జిన్నింగ్ మిల్లులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ముందుగా పత్తి జిన్నింగ్ యజమానులు విఠల్, నిఖిల్ యంత్రాలకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొట్టమొదట పత్తి తీసుకొచ్చిన రైతును ఆ రైతును కండువా, టోపీతో సన్మానించి పత్తి బండికి బండికి పూజలు చేశారు. పత్తి క్వింటాల్‌కు రూ.10055 ధర పలికింది. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి, పత్తి యజమానులు, కమీషన్ ఏజెంట్లు పాల్గొన్నారు.