Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో భూగర్భ జలమట్టం 4.26 మీటర్లు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం... 2015 మే నెలలో భూగర్భ మట్టం 13.27 మీటర్లు కాగా 2002 మే నెలలో 9.01 మీటర్లు మాత్రమే. 83 మండలాలు సురక్షిత జాబితాలో చేరాయి. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వివిధ పథకాల అమలు కోసం నీటి లభ్యతపై చేసిన పరిశోధనల్లో ఈ ఫలితాలు కనిపించాయి. 2021-22 లో 12,500 పరిశోధనలు నిర్వహించి 10,946 చోట్ల నీటి లభ్యత ఉన్నట్టు గుర్తించారు. దీంతో 2,885 చోట్ల బోరు బావులు, ట్యూబ్ బావులు వేసేందుకు సిఫారసు చేయగా 4,500 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందారు. 6,615 హెక్టార్లకు సాగునీరు అందింది. ఈ ఏడాది నిర్వహించిన విశ్లేషణలో 2017లో 65 శాతంగా ఉన్న భూగర్భ జల వినియోగం 42 శాతానికి తగ్గినట్టు వెల్లడైంది. భూగర్భ జల నాణ్యతను నిర్దారించేందుకు రెండు సార్లు అంటే వర్షాకా లానికి ముందు మే నెలలో, తర్వాత నవంబర్ నెలలో విశ్లేషిస్తారు.