Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ చీఫ్ రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చుతుందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆనాడు గాంధీ చేపట్టిన దండియాత్రలా... భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఒక కీలకమైన యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప అవకాశమని తెలిపారు. శనివారం హైదరాబాద్ మణికొండలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్‌కుమార్ నివాసంలో మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందంతో ఆయన సమా వేశమయ్యారు. కర్ణాటకలో 22రోజులు, ఏపీలో నాలుగు రోజులు జోడో యాత్ర సాగనుందని తెలిపారు. అక్టోబర్ 24న యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుదనీ, ఆ తర్వాత మహారాష్ట్ర కొనసాగుతుందన్నారు. మహా రాష్ట్ర, తెలంగాణకు చెందిన పార్టీ నాయకుల సమన్వయం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు కర్ణాటకలోలో కొనసాగుతున్న పాదయాత్రలో పాల్గొనాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మహారాష్ట్ర సీల్పీ నేత బాల సాహబ్తోరాట్, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ సెక్రెటరీలు సోనాల్ పటేల్, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.