Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ నేత, ఏఐసీసీ సభ్యులు కొనగాల మహేష్ ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అత్యున్నత డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ- పీహెచ్డీ) పట్టాను పొందారు. ఈ మేరకు ఓయూ అధికారిక గెజిట్ ప్రకటన విడుదల చేసింది. కామర్స్ లో కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించినం దుకుగానూ ఓయూ ఆయ నకు డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర లోనే గొప్ప రీసెర్చ్ అంశంగా ఈ థీసిస్ నిలవబోతుందని కామర్స్ డిపార్టు మెంట్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు మాణిక్కం ఠాగుర్, మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మహేశ్ కుమార్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య తదతరులు శుభాకాంక్షలు తెలిపారు.