Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డయాలసిస్ రోగులకు నెలకు కనీసం రూ.5,016 పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సీహెచ్.మోహన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయాలసిస్ రోగులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ అదే తరహాలో పెన్షన్ ఇవ్వాలంటూ గత ఐదేండ్ల నుంచి తమ అసోసియేషన్ కోరుతున్నదని గుర్తుచేశారు. తాజాగా సెప్టెంబర్ 30న ప్రభుత్వం డయాలసిస్ రోగులకు ఒక్కొక్కొరికి రూ.2,016 రూపాయలను అందజేశారని తెలిపారు. దాన్ని కనీసం రూ.5,016 కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.