Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
- 64శాతానికి చేరిన రిజర్వేషన్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని..వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలవుతాయని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగనియామకాల్లో మొత్తం రిజర్వేషన్లు 64శాతానికి చేరాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10,సి- 1,డి-7,ఇ-4) 29,ఈడబ్య్లుఎస్కు 10శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.