Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న లాట్ మొబైల్స్ దసరా, దీవాళి ధమాక ఆఫర్లను ప్రకటించింది. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని బ్రాండెడ్ మొబైల్స్, స్మార్ట్ టివిలు, లాప్‌ట్యాప్స్, స్మార్ట్ వాచీలు, హోమ్ థియేటర్ తదితర ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని లాట్ మొబైల్స్ డైరెక్టర్ ఎం అఖిల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఇన్వ ర్టర్లు, ప్రింటర్లను కూడా ప్రవేశపెట్టామన్నారు. పండగ సీజన్ సందర్బం గా ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్డ్ కాలింగ్ వాచ్, టవర్ ఫ్యాన్, టిడబ్ల్యుఎస్ ఎయిర్‌పొడ్స్, పోర్టబుల్ స్పీకర్, నెక్‌బ్యాండ్, హోమ్ థియేట ర్ కాంబో ఆఫర్లు లభిస్తాయని తెలిపారు. తక్కువ ధరలో రూ.8,999కే స్మార్ట్ టివి, రూ.17,499కే ల్యాప్‌ట్యాప్‌లను అందుబాటు లో ఉంచామ న్నారు. ఎస్బిఐ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం వరకు తక్షణ క్యాష్ బ్యాక్ లభిస్తుందన్నారు. ప్రీమియం స్మార్ట్ఫోన్లపై రూ.8,000 వరకు ఎక్సేంజీ బోనస్, స్మార్ట్ వాచీలపై 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చన్నారు. వివో, ఒప్పో, సామ్సంగ్, వన్‌ఫ్లస్ తదిరత ఫోన్లపై, పలు బ్రాండ్ల టివిలపై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందిస్తున్నట్లు వెల్లడించారు.