Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల కుటుంబాలకు రూ. 20 వేల ఆర్థిక సాయం
నవతెలంగాణ-వెల్దండ
మాజీ ఎంపీపీ జయప్రకాశ్ మానవత్వం చాటుకున్నారు. మండల పరిధిలోని ఈదమ్మ బండ తండాలో పిడుగు పాటుకు మృతి చెందిన గిరిజన మహిళల కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. 20వేల ఆర్థిక సహాయాన్ని జయప్రకాశ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు తిరుమల రావ్, మాజీ సర్పంచ్ లాలూ నాయక్, జలంధర్, శ్రీనివాస్, జగదీశ్వర్, నాగేశ్, శ్రీహరి, మల్లేశ్, శంకర్, జగన్, శ్రీను, శశి కుమార్, మైపాల్లు పాల్గొన్నారు.