Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంంగాణలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33 ను జారీ చేయటం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎస్టీల జనాభా పెంపుకు అనుగుణంగా జీవో తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. అదే సమయంలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించారనీ, అందుకు చర్యలు తీసుకో వాలని కోరారు.
జీవో జారీ చేయటాన్ని స్వాగతిస్తున్నాం: తెలంగాణ గిరిజన సమాఖ్య
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవో 33ను స్వాగతిస్తున్నామని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి చట్టబద్దత కల్పించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.