Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మాగాంధీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం.. మహాత్ముడు జాతికి అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అహింసా, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి ప్రపంచానికి సరికొత్త పోరుబాటను గాంధీ పరిచయం చేశారని అన్నారు. గాంధీ బాటలో పయనించిన దేశాలెన్నో బానిసత్వం నుంచి విముక్తి పొందాయని తెలిపారు. ప్రజాస్వామిక పంథా ద్వారా దేశ ప్రజలను స్వాంత్య్రోద్యమంలో లక్ష్యసాధన దిశగా కార్యోన్ముఖుల్ని చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అహింసా, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి ప్రపంచానికి సరికొత్త పోరుబాటను గాంధీజీ పరిచయం చేశారని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు జాతిపిత అని కొనియాడారు. సత్యమేవ జయతే.. అని చాటి చెప్పిన మహాత్ముడి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వివరించారు. గుంపులో ఒకరిగా ఉండటం తేలికే కానీ ఒంటరిగా నిలబడటానికి ధైర్యం కావాలన్న గాంధీ మాటలే ప్రేరణగా హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తోందని సీఎం పేర్కొన్నారు.
కిషన్ రెడ్డి మాటల్లో వాస్తవం లేదు:కేటీఆర్ ట్వీట్
మెడికల్ కళాశాలల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు కేంద్రం తొమ్మిది మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి చెప్పడంలో ఏ మాత్రం వాస్తవం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ''ఓ సోదరుడిగా కిషన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తా. కానీ అసత్యాలు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. అబద్ధాలు మాట్లాడే కిషన్ రెడ్డికి తన తప్పును అంగీకరించే ధైర్యం కూడా లేదు'' అని కేటీఆర్ విమర్శించారు.