Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు మహిళా సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు కిందిస్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది, మినిస్టీరియల్ స్టాఫ్ ఈ వేడుకలలో పాల్గొన్నారు. డీజీపీ ప్రధాన కార్యాలయం ఆవరణలో పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మ చుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ అధికారులు, సిబ్బంది లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పోలీసు అధికారులు వారిని ప్రోత్సహించి శుభాకాంక్షలు తెలిపారు.