Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్టు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారంతో గడువు ముగియగా.. విద్యార్థుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 47 కోర్సుల్లో 7,500 వరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.