Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ బ్యూరో
గాంధీ జయంతి సందర్భంగా ఎస్బిఐ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్లో సైక్లోథాన్, వాకథాన్ నిర్వహించారు. ఎస్బిఐ హైదరా బాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ది సాధించాలని జాతిపిత మమాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిలు నిత్యం ఆకాంక్షించేవారని అన్నారు. ఆ లక్ష్యంతోనే ప్రధాని మోడీ ఆత్మనిర్భర భారత్ తీసుకొచ్చారని చెప్పారు. స్వయం సమృద్ధి కోసం దేశం చేస్తున్న కృషిలో ఎస్బిఐ భాగస్వామ్యమవుతుందని తెలిపారు. అనంతరం ఎస్బిఐ ఉద్యోగులు పివి జ్ఞానభూమి పరిసరాల్లో శ్రమదానం చేసి శుభ్రపర్చారు.