Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్‌డీ) రవీందర్‌సింగ్ ధిల్లాన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) సీఎమ్‌డీ వీకే దేవాంగన్ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించారు. వీరు కాళేశ్వరం, యాదాద్రి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షా సమవేశాల్లో పాల్గొన్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ రెండు సంస్థలు పై ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిన విషయం తెలిసిందే. ఆయా ప్రాజెక్టు పనులు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయా? అంచనా వ్యయాలు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఎప్పటి లోపు వాటిని పూర్తిచేస్తారు? వంటి పలు అంశాలను రాష్ట్ర అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పర్యటనలో చివరిరోజైన ఆదివారం వారిని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు కలిసి, విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. అనంతరం వారు ఢిల్లీ వెళ్లారు.