Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జలజీవన్ పురస్కారం అందుకున్న అధికారులు
- వందశాతం నల్లానీరందిస్తున్న పెద్ద రాష్ట్రంగా నిలిచిన వైనం
- 14 అవార్డులను దక్కించుకున్న రాష్ట్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వచ్ఛభారత్ దివస్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతులమీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు రాష్ట్రప్రభుత్వం తరపున జలజీవన్ మిషన్ పురస్కారాన్ని అందుకున్నారు. పథకం పనితీరు, నిర్వహణపై రాష్ట్రంలోని 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా కేంద్రం అధ్యయనం. ప్రజాభిప్రాయాలు సేకరించింది. ఈ పథకం ద్వారా రోజూ ఇంటింటికి నాణ్యమైన తాగు నీరు అందుతున్నట్టు కేంద్రం గుర్తించి జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. 100శాతం ఇంటింటికీ శుద్ధి చేసిన మంచినీరు అందిస్తున్నందుకుగానూ మిషన్ భగీరధ పథకానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పురస్కారం లభించింది. స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే అత్యంత ప్రతిభావంత రాష్ట్రంగా గుర్తింపు పొంది ఏకంగా 13 అవార్డులను సొంతం చేసుకున్నది. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు అందుకున్నారు.
అవార్డులందుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు : మంత్రి ఎర్రబెల్లి
మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ సర్వేక్షణలో నెంబర్వన్ నిచిలి ఆదివారం న్యూఢిల్లీలో వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అవార్డులందుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు గ్రహీతలను అభినందించారు. సీఎం కేసీఆర్ ఆలోచనాపథంలో పని చేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలనీ, తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.