Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బతుకమ్మ సంబరాలు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి తదితరులు మహిళా జర్నలిస్టులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. తెలంగాణ సాంస్కతిక శాఖకు చెందిన కళా బందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాల లాంటి ప్రదర్శనలు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయని మహిళా నాయకులు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పాటు సెలవు దినంగా చేశారన్నారు. పండుగతో గ్రామీణ పేద మహిళలూ కొత్త చీరలు ధరించి బతుకమ్మ ఆడేలా రూ.339 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. దీని ద్వారా నేతన్నలకూ ఉపాధిని కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ సభ్యులు, వారి కుటుంబాల మహిలలూ సిద్దం చేసిన బతుకమ్మల పోటీల్లో ఉత్తమ బహుమతికి ఆకారపు రమాదేవి ఎంపికయ్యారు. విజేతలకు ప్రెస్‌క్లబ్ కమిటీ బహుమతులు ప్రధానం చేసింది. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.వేణుగోపాలనాయుడు, రవికాంత్‌రెడ్డి, కమిటీ ఉపాధ్యక్షులు శ్రీకాంతరావు, వనజ, కోశాధికారి రాజేష్. సంయుక్త కార్యదర్శులు హరి, రమేష్ వైట్లతో పాటు కార్యవర్గం హాజరైంది.