Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖతర్‌లోని భారత రాయబారి డా.దీపక్ మిట్టల్, ఆయన సతీమణి అల్పన మిట్టల్, తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని హాజరయ్యారు. అనంతరం ఖతర్‌లో జరగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ కోసం అక్కడి ప్రభుత్వం నిర్మించిన అత్యాధునిక స్టేడియాల వద్ద బతుకమ్మలపై రూపొందించిన పాటలను విడుదల చేశారు. చిన్నారులు, ఆడపడుచులు బతుకమ్మ ఆట పాటలతో అలరించగా గల్ఫ్ కార్మిక సోదరులు సైతం పల్లె పాటలతో ఆకట్టుకున్నారు. దాదాపు 1,500 మంది బతుకమ్మలను నీళ్లలో వదిలి సత్తు పిండి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.